ట`140
ప:ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశతార పర్వత సముద్రములకన్న గొప్పది
1.ఆగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి
ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ॥ఓ॥
2.సంకట సమయములో సాగలేకున్నాము
దయచూపు నామీద అని నేను మొర్రపెట్టగా వింటినంటివి
నా మొరకు ముందె తోడు నుందునంటివి ॥ఓ॥
3.మరణాంధ కారంపు లోయ నే సంచరించిన
నడుపు కరుణగల ప్రభువు ॥ఓ॥
4.కొదువ లెన్నియున్నా భయపడను
నేనెపుడు పచ్చిక బయలులో
పరుండ జేయును భోజన జలములతో తృప్తిపరచుచు
నాతో నుండునేసు ॥ఓ॥