ప:దేవా నా మొర ఆలకించుమా నా ప్రార్ధనకుచెవి యొగ్గుమా (2)
నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2)
నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నను నడిపించుము (2) ॥దేవా॥
1. నీవు నాకు ఆశ్రయముగ వుంటివి
శతృవుల యెదుట బలమైన కోటగా వుంటివి (2)
యుగయుగములు నేను నీ గుడారములో వుందును
నీ రెక్కల చాటు దాగి యుందును (2) ॥దేవా॥
2. నా రక్షణ మహిమకాధారము నీవే
నా ఆశ్రయదుర్గం నా నిరీక్షణ మార్గం నీవే (2)
నీ ప్రేమ బాటలో నడిపించుమయా నీ పోలికగా నన్ను మలచుమయా (2) ॥దేవా॥