పాట `176
ప: చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా (2)
ప్రేమా మయుడవై ప్రేమించావు కరుణామయుడవై కరుణించావు
తల్లిగా లాలించి తండ్రిగ ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలునయా (2)
1. జిగట గల ఊబిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరిచి నిలిపితివయ్యా (2)
హిస్సాపుతో నన్ను కడుగువ యేసయ్యా
హిమవ కంటెను తెల్లగా మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమ కరుణ నీ కృపచాలు (2) ॥చాలు॥
2. బంధువులు స్నేహితులు త్రోసేసిన
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా
నన్ను నీవు ఎన్నడు విడువలేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించి నావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా
నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా
ప్రేమ కరుణ నీ కృప చాలు (2) ॥చాలు॥