పాట `87
ప: స్తుతి సంగీతనాదముల్ శ్రీ యేసునికింపైన ఆరాధన
స్తుతి సింహాసనాసీనుడా శ్రేష్ఠ గీతము పాడెదం
అప: యోగ్యుడవు ఓ గొఱ్ణెపిల్లా హోసన్నా హోసన్నా
అర్హుడవు మా యేసు ప్రభూ హల్లేలూయ హల్లేలూయ
స్తోత్రము ప్రభావమునుయుగయుగవలు కల్గును
మహిమయు ఘనత యుగయుగములు కల్గును
1. ప్రాణమిచ్చి కుమారులనుగ స్వీకరించితివి
పరిశుద్ధులుగా స్వకీయజనముగ సంపాదించితివి ॥యోగ్యు॥
2. విశ్వాసప్రేమ నిరీక్షణతో నిబంధనా ప్రజగా
పరిశుద్ధాత్మతో అభిషేకించి సాక్షులు చేసితివి ॥యోగ్యు॥
3. ప్రతి వంశముములో ప్రతి భాషలలో ప్రతి జనాంగములో
రాజులైన యాజక బృందవ నేర్పరచుకొంటివి ॥యోగ్యు॥