పాట-15
ప: కీర్తనీయమైనది క్రీస్తు గానసుధ కరిగిపోని పెన్నిధి క్రీస్తు పుణ్యకథ (2)
నిరాశల నిశీధిలో విరాగవు ఎడారిలో కన్నతోడు ఉన్న దిక్కు క్రీస్తు నీకు జత
కరుణ చూపి కలతబాపి కన్న తండ్రి కథ మనకున్న తండ్రి కథ
1. ఆకలైన వేళలో అన్నమతడె తెలుసుకో
చీకటిపడు వేళలో దీపమతడె తెలుసుకో
వేళాలేదు పాళలేదు శరణు వేడగా పేదసాద అంటే చాలు
కరుణ చూపగా మహిజనులకు మహిమ తెలిపి
ఆ మమతలు చూపగా తీరిపోవు వ్యధ ॥కీర్తనీయ॥
2. తల్లడిల్లు వేళలో తల్లిప్రేమ అతనిది
తనయుని విడనాడినా తండ్రి మనసు అతనిది (2)
పాపాలెన్నో చేసే జనపదము గంటినా
కామం, క్రోధం, లోభం మోహం సిలువ వేసినా
కఠిన జనులు కలి నరులును
ప్రేమ కలిగి బ్రోచిన ప్రేమ వూర్తి కథ ॥కీర్తనీయ॥