పాట`271
ప. ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైన రుచియించినావా
ఇప్పుడైన ఆశించిరావా...
1. నీ దేవుండెవరు ? నీ పూజెవ్వరికి ?
నశియించే వెండి బంగారాలకా ?
నిజదైవమెవరో నీ రక్షకుడెవరో ?
నీవెప్పుడైన తలచినావా `నీకున్న లోటెరిగానావా ॥ఏసాటి॥
2. కల్వరిగిరి పై విలువైన ప్రాణం
అర్పించి మరణించెను నీ కోసమే ॥2॥
నిన్ ఎంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ గ్రోలెన్
బోధంబునా రావదేవా ॥ఏసాటి॥
3. వేదంబులందు వ్రాయబడినట్లు `ఈ ధరను రక్షింప నవతరించి
బలియాగమైన ప్రభుయేసు కాక ` మరి ఎవ్వరైనను కలరా
మనసార యోచించి రావా ॥2॥ ॥ఏసాటి॥