1. హా! యానంద సుదినము నా యేసున్ నమ్ము దినము
ప్రయాస మెల్ల బోయిన దయా రక్షణ్య దినముప:
భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము
భక్తి ప్రార్ధన లేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన
భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము
2. ప్రభునితో నిరంతరమౌ నిబంధన జేసికొంటి
నేబట్టితి నింపొంగ విభుని పాదపద్మము ||భాగ్య||
3. నా యాత్మ శాంత మొదుము నీ యేసే నీ యాధారము
భయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము ||భాగ్య||
4. నే నేసువాడ, నేసుడు నిత్యంబు నా వాడాయెనె
నాదెంత గొప్ప భాగ్యము నే నేసు యొక్క మిత్రుడన్ ||భాగ్య||
5. నే జేసెడి యొప్పందము నెల్లెడ నేరవేర్తును
నే జచ్చు వేళయందును నే దీనిమెచ్చిపాడుదున్ ||భాగ్య||