పాట `169
ప: నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువ లేదిలలోన
పచ్చికగలచోట్ల నన్ను జేర్చి స్వచ్చమగు జలవ త్రాగనిచ్చి
నా ప్రాణము నకు సేదను తీర్చి నన్ను నడుపుము నీతిమార్గము ॥నీవే॥
1.గాఢాంధకార లోయలందు పడియుండి నేను సంచరించినను
తోడైయుందువు నీ దుడ్డుకర్ర దండముతో నీ వాదరించెదవు ॥నీవే॥
2.శత్రువుల యెదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి
నా తల నూనెతో నంటిjన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ॥నీవే॥
3.నిశ్చయముగా కృపా క్షేమముల్ వచ్చు నా వెంట నే బ్రతుకు
దినవము చిరకాలము యెహోవా మందిరమున స్థిరముగనే నివసించెదన్