పాట `284
ప: ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు
వాసము చేయుచుండె
1. తాను కాపురముండు స్థలము
తన స్వంత ప్రజల మధ్యనే
దేవుడు తానే వారి దేవుడై యుండి
ప్రతి భాష్ప బిందువు తుడుచున్
2. దేవుని ఆలయమాయనే
ప్రజ్వలించు దీపము ఆయనే
జీవ జలములతో వారి దాహమును
తీర్చు జీవనది ఆయనే
3. పూర్ణ మహిమతో నిండినది
మహా పరిశుద్ద స్థలమదియే
స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో
మా పాదముల్ నిలిపెదము