పాట `78
ప: వెండి బంగారాల కన్నా మిన్నయునది యేసుప్రేమ నా యేసుప్రేమ
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ ॥వెండి॥
1. లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ
లోకులకై కరిగిపోంన ప్రేమ లోకాన్ని జంంచిన ప్రేమ
యేసుప్రేమ శాశ్వతప్రేమ హల్లెలూయ మహదానందమే ॥వెండి॥
2. ఏ స్థితికైన చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ
నీకు బదులు మరణించిన ప్రేమ చిరజీవము నీ కొసగే ప్రేమ
యేసుప్రేమ శాశ్వతప్రేమ హల్లెలూయా మహదానందమే ॥వెండి॥