పాట`256
ప. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ (2)
తల్లి ప్రేమను మించినది ` లోక ప్రేమను మించినది
నిన్ను నేను ఎన్నడు విడువను (2)
నిత్యము నీతోనే జీవింతున్ ` సత్యసాక్షిగా జీవింతున్
ఆరాధింతును సాష్టాంగపడి ॥4॥
స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు
1. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ (2)
ఏక రక్షకుడు యేసే ` లోక రక్షకుడు యేసే
నీ చిత్తమును చేయుటకై ` నీ పోలికగా ఉండుటకై (2)
నా సర్వము నీకే అర్పింతున్ `పూర్ణానందముతో నీకే అర్పింతున్
2. నిత్య రాజ్యములో నన్ను చేర్పించున్ (2)
మేఘరధములపై రానైయున్నాడు`యేసురాజుగా రానైయున్నాడు
ఆరాధింతును సాష్టంగా పడి (2)
స్వర్గా రాజ్యమున్ యేసున్ ` సత్య దైవం యేసున్