పాట `92
ప: సర్వకృపా నిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా
స్తోత్రముచేసి స్తుతించెదను సంతసముగ నిన్ను పొగడెదను
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయయని పాడెదను
ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను
1. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి పరిశుద్ధ
జీవితం చేjటకై పాపిని నను కరుణించితివి ॥హల్లె॥
2. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి నాదుని
అడుగుజాడలలో నడచుటకై నన్ను పిలిచితివి ॥హల్లె॥
3. మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను దీర్చితివి ॥హల్లె॥
4. భువినుండి శ్రేష్టఫలముగాను దేవునికి నిత్యస్వాస్థ్యముగా
భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి ॥హల్లె॥
5. ఎవరుపాడని గీతమును యేసుతో నేను పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెన్ యేసుకు నేనే మివ్వగలన్ ॥హల్లె॥