1. నే నీవాడనై యుండగోరెదన్ యేసు ప్రియరక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్ను జేర్చు నీదరిన్
ప: నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా నీవుపడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా గాయపడ్డ ప్రక్కకున్
2. నన్ను బ్రతిష్టబర్చు మీ నాథా నీదు కృపవల్లనే నాదు ఆత్మ
నిన్ను నీరీక్షించున్ నీ చిత్తంబు నాకగున్ (నన్ను)
3. నీదు సన్నిధిలో నికనుండి నెంత తుష్టి నాకగున్
స్నేహితునిగ మాటలాడుదున్ సర్వశక్తి ప్రభుతో (నన్ను)
4. నీదు దివ్య ప్రేమాతిశయవ ఇహబుద్ధికందదు
పరమందున దాన శ్రేష్టత నేననుభవించెదన్ (నన్ను)