పాట `90
ప: అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్నదరంబయో
కన్న తండ్రి మున్నె కెక్కి నమోక్ష వాసాళి
సన్నుతు లున్నతమై యుండ వన్నె నీకు (అన్ని)
1. నిన్ను బ్రకటన సేయ నిఖిల లోకములను
బన్నుగజేసిన బలుడనీవె ఉన్న లోకంబుల
నుడుగక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడనీవె
అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు నున్న
సర్వజ్ఞుండవునీవే ఎన్నశక్యముగాక ఉన్నలక్షణవలు
సన్నుతించుటకునే జాలుదునా ॥అన్ని॥
2. పుటింప నీవంచు బోషింప నీవంచు గిట్టింప నీవంచు
గీర్తింతును వట్టి పనికి మాలినట్టి మానవుల చేపట్టి
రక్షింప బాధ్యుండవంచు దట్టమైన కృపను దరిజేర్చ
నాకిచ్చి పట్టం నిలచియుండు ప్రభుడవంచు
గట్టడచే గడ వట్టుదనుక న పట్టుకొలది నిన్ను బ్రస్తుతింతు ॥అన్ని॥
3. కారుణ్య నిధి నీవు కఠినాత్ముడను నేను
భూరి శుద్ధడ నీవు పాపి నేను సార భాగ్యుడ నీవు
జగతిలో నాకన్న దారిద్య్రుడే లేడు
తరచి చూడ సార సద్గుణవల సంపన్నుడవు నీవు
ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతి ంంతు నే రీతి
సేవింతు నేర మెన్నక బ్రోవనెర నమ్మితి ॥అన్ని॥