పాట -294
ప:రక్షకుండు యుదరంచి నాడట మనకొరకు
పరమ రక్షకుండు యుదరంచినాడట
రక్షకుండుయుదరంచినాడు రారేగొల్ల బోయ లార
తక్షణమున బోర మన నిరీక్షణ ఫలవెందుదవ
1.దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు
దేవుడగు యెహోవా మన దిక్కుదేేరి చూచినాడు ||రక్ష||
2.గగనమునుండి ది గ్గి ఘనుడు గబ్రియేలు దూత
దగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష సువార్త ||రక్ష||
3.వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు
కర్తనుజూచిన వెనుక కాంతవ విశ్రమం బప్పుడు ||రక్ష||
4.పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములు జుట్టి
శిశువునుగనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్ష||
5.అనుచు గొల్ల లొకరికొక రానవాలు జెప్పుకొనుచు
ననుమతించి కడకు క్రీస్తు నందరికి దెల్పినారు ||రక్ష||