పాట`152
ప: రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది
1.మలిన వస్త్రమువలెనే నిండియుంటిమి
నిందలతోతండ్రి మాదిరిగా మమువెదకి
వచ్చి వింతగా మమ్ము రక్షించెను
2.అరణ్య ప్రదేశములో పాడైన
యెడారిలోకనుగొనెను పరమర్శించెన్
కనుపాపవలె గాచెన్
3.యాకోబువలె నుంటిమి ఇశ్రాయేలుగా
మార్చెన్తన స్వాస్థ్యముగా, తన
భాగముగా తన జనముగానైతిమి
4.పర్వతములను సృజించెన్
శ్రేష్ఠమైనవి నిచ్చెన్ అబ్రహాం మోషే
ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను
5.పక్షిరాజువలె ప్రభువు రెక్కలలతో
మము మోయున్అలసట లేక,
మము పట్టుకొని ఆకసమున నడుపును
6. యేసుని సత్యములు పర్వత
శిఖరములుపరిపూర్ణమగు ప్రభు
రక్షణను పరికింప జేయును
7.యెషయా ప్రవచనములు రక్షణ
వివరములుశిఖర శ్రేణి యనుభవములు
శిఖరముపై పొందుము