పాట `216
ప: స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసెన్
చేసెను మేలులెన్నో ఆడిపాడి పొగడెదన్
తండ్రీ స్తోత్రం దేవా స్తోత్రం (2)
1.ప్రాణం ఇచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే
నీ కొరకు బ్రతుక వేరుపరచి సేవచెయ్యకృపనిచ్చితివే ॥తండ్రీ॥
2.గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువరక్తము కార్చితివే
రక్తకోటలో దాచుకొని శత్రువురాకుండా కాచితివే ॥తండ్రీ॥
3.చూచే కన్నులు ఇచ్చితివే పాడే పెదవులు ఇచ్చితివే
కష్టించే చేతులు ఇచ్చితివే పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివే ॥తండ్రీ॥
4.మంచి ఇళ్ళను ఇచ్చావయ్యా వసతులన్నియు ఇచ్చావయ్యా
కష్టించి పనిచేయ కృపచూపి అప్పులేకుండా చేసితివే ॥తండ్రీ॥