పాట `60
ప: స్తుతించినా సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు
స్తుతించి పాడి కోటను కూల్చెదమ్ స్తుతులు శక్తితో యెరికో పట్టెదం
1. దావీదు పాడగా సౌలుకు విడుదల
కలతలు తీరెను నెమ్మది దొరికెను ॥స్తుతి॥
2. స్తుతించు దావీదుకు ధైర్యము నిండెను
విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను ॥స్తుతి॥
3. గొఱ్ఱెల కాపరి రాజుగా మారెను
ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను ॥స్తుతి॥
4. చేప కడుపులో యోనా స్తుతించే
విడుదల పొంది నినివే చేరెను ॥స్తుతి॥
5. పెదవితో స్తుతులు చేతిలో వాక్యం
స్వార్థం నలుగగొట్టి జయవను పొందెదమ్ ॥స్తుతి॥