పాట`210
ప. నీ ఆవరణములో ఒక దినం వెయ్యి దినముల కంటే శ్రేష్టము
నా దేవా నా ప్రభువా ఆధన్యత నాకిమ్ము నీ సాక్షిగా ఉండనిమ్ము ।నీ॥
1.నీ మందిరావరణములో నివసింపవలెనని
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది` ఆది సొమ్మసిల్లు చున్నది (2)
నీ నివాసములు ఎంతో రమ్యములు (2) ॥నీ॥
2.జీవము గల దేవుని దర్శింపవలెనని` నా హృదయమెంతో కేక వేస్తున్నది
అది ఆనందముగా ఉన్నది (2) నీ నివాసములు ఎంతో రమ్యములు (2) ॥నీ॥
3. నీ మందిరములో నివసించు వారే ధన్యులు నీ సన్నిధిలో నిత్యం స్తుతియింతురు `
సీయోనులో వారుందురు నీ నివాసములు ఎంతో రమ్యములు (2) ॥నీ॥