పాట`108
ఆరాధనలో ఉంది విడుదల
ఆరాధనలో ఉంది స్వస్థత ॥2॥
ఆత్మలో, దేహంలో`శాంతి ఆనందమిచ్చును
ప్రేమతో ప్రియ ప్రభువు ॥2॥
ప. ప్రార్ధించుము, ఆరాధించుము `
అవి మంచివి శ్రేష్ఠమైనవి ॥హల్లెలూయా ॥2॥
విడుదల దొరకునెప్పుడు ॥2॥
1.అడిగెడు వారికి ఇచ్చున్ వెదకెడు
వారికి దొరుకున్ ॥2॥
తట్టుడి తీయుము ఇప్పుడే
దొరకును పరమాశీర్వాదముల్ ॥ప్రా॥
2.ప్రార్ధించుడి ఎల్లప్పుడు
ప్రార్ధించుడి నమ్మికతో ॥2॥
నీతిమంతుల ప్రార్ధన విశ్వాస ప్రార్ధన
విడిపించు బంధకములన్ ॥ప్రా॥