పాట`107
1. సుందర రక్షకా ! సృష్టి యొక్క నాధా
దేవమానవ పుత్రేడా ` నిన్ను బ్రేమింతున్
సదా సేవింతున్ ` మదాత్మతో గిరీటమా
2. మైదాన మంతయు ` పచ్చిక బయళ్లు
నొప్పగ బూచుచున్నవి ` ఐనను యేసుతో
నాయన కాంతిలో ` దు:ఖములేనివారము.
3. సూర్యుని కాంతియు ` చంద్రుని శాంతియు
ఎంతో శ్రేష్ఠమై యున్నవి ` అట్లవి యున్న
అన్నిటి కన్న ` యేసుని కాంతి గొప్పది
4. ఆనంద రక్షకా! ప్రజల నాధుడా
దేవమానవ పుత్రుడా ` మహిమ, ఘనత
స్తుతి, యారాధన ` నిరంతరంబు నీకగున్