పాట `342
ప: కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా
కలుషవ బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా
అజేjడా విధేjడా సజీవుడా సంపూర్ణుడా ॥కలు॥
1. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా
వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా
మధురమైన ప్రేమ మరువగలనా దేవా అనుక్షణం
నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ ॥కలు॥
2. ద్రోహానికై నా మోక్షానికై నీ రక్తాన్ని కార్చావయ్యా
పాపానికై నా శాపానికై మరణించి లేచావయ్యా
తరగనీదు ప్రేమ చెరిగిపోవున దేవా అనుక్షణం
నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ ॥కలు॥