పాట `102
పల్లవి: ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో
అ.ప. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును
హర్షించి పొగడి పూజింతును యేసుని నామవను ॥రక్షణ॥
1. పాపినైన నన్ను రక్షింపను సిలువపై నాకై తానెక్కెను
పరిశుద్ధ జీవం నాకివ్వను మృత్యుంజయుడై లేచెను (రక్షణ)
2. మరణపుటురులలో నేనుండగా నరరూపియు
నా కడ కేతెంచెనుపరలోక జీవం
నాకివ్యను మరణపు వల్లు విరిచెను (రక్షణ)
3.శత్రుని ఉరి నుండి విడిపింపను శత్రువుతో నాకై పోరాడెను
పదిలంపు జీవం నాకివ్వను క్రీస్తునందు నను దాచెను (రక్షణ)
4. పరలోక పౌరత్వం నాకివ్వను పరమును వీడి ధరకేతెంచెను
సమృద్ధి జీవం నాకివ్వను తన ప్రాణమర్పించెను (రక్షణ)
5. శోధన వేదన బాధలెన్నో ఈ లోకయాత్రలో ఎదురైనను
ప్రత్యేక జీవం జీవించను అర్పించుకొందు నీకు
అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా
హల్లెలూయా ఆమెన్`హల్లెలూయా
ఆమెన్`హల్లెలూయా (ఆనందవతో)