ప: కొనియాడి - పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా
1. పరిశుద్ధుడవు - నీతిమంతుడవు పాపపు వస్త్రము - మార్చినదేవ
ప్రాపుగ రక్షణ - వస్త్రమిచ్చితివి - పొగడెద నిన్ను ధవళవర్ణుడా ||కొని||
2. తూర్పు జ్ఞానులు - నీ కర్పించిరి బంగారు సాంబ్రాణి బోళము
తెలుపబడెను - నీ ఘనవిజయము భజియించెద నిన్ను రత్నవర్ణుడా ||కొని||
3. గుర్తించెద నిన్ను - ఘనముగ నేను ఘనుడా నాకు ప్రభుడవు నీవే
పదివేలలో నా ప్రియుడగు ప్రభువా పరికించి నిన్ను పాడా స్తుతించెద ||కొని||
4. ఆరాధించెద - ప్రభువా దేవా ఆత్మతోను - సత్యముతోను
తిరిగిరానై యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే ||కొని||