పాట`155
ప: ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్
1.చావు గోతినుండి లేవనెత్తి నాకు
జీవమిచ్చిన జీవదాతవివరింతు నే
నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున్ ॥ఆనం॥
2.సింహపు పిల్లలు ఆకలిగొనును
యెహోవా సహాయుడందరికిఇహమందున
నీ మేలు కొదువయుండదు
ఆహా! ఏ మందు నీ విశ్వాస్యతన్ ॥ఆనం॥
3. ఎన్నెనో శోధన బాధలు రేగి నన్ను
కృంగదీయ పోరాడినన్ఘనమైన
నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్నతండ్రీ నిన్ను కొనియాడెదన్ ॥ఆనం॥
4.చావు చీకట్ల లోయలందున
జీవపు వెలుగై త్రోవ జూపి
దేవా తోడై నడిపించితివి నీ కృపన్
వివరించెదన్ నీ విశ్వాస్యతన్ ॥ఆనం॥
5.నీతి న్యాయంబులు ఆధారములై
నీ సింహాసనమున నిలచినవి
నిత్య కృపా సత్యంబులు నీదు
సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి ॥ఆనం॥
6.పర్వతంబులు పారిపోయినను
ఉర్విలో మార్పు కలిగినను
తరుణములు విరోధముగ పై
లేచిన స్మరియించెద నీ విశ్వాస్యతన్ ॥ఆనం॥