పాట `208
ప:నీవుంటే నాకు చాలు యేసయ్య నీవెంటే నేఉంటా యేసయ్యా
నీమాట చాలయ్య నీచూపు చాలయ్య
నీతోడు చాలయ్య నీ నీడ చాలయ్య (2)
1.ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను
ఎంత కష్టము వచ్చిన నిషూర్టమైనను (నీమాట)
2.బ్రతుకునావ పగిలినా కడిలిపాలైనను
అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (నీమాట)
3.ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (నీమాట)
4.పాపినై నేనుండగా పాపము తుడిచావయ్య
దోషినై నేనుండగా దారిచూపావయ్యా (నీమాట)