పాట `40
ప:గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గాన మాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని నీకీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నాయేసునాధా హల్లెలూయా నా ప్రాణనాధా
1.అద్భుత క్రియలు చేయువాడనిఆశ్చం1్యకార్యములు చేయగలవని
అద్వితీయుడవని ఆది సంభూతుడవని ఆరాధించెద నిత్యవ నిన్ను ॥హల్లె॥
2.సాగరాన్ని రెండుగా చీల్చినావని సాతాను శక్తులను వంచినావని
సర్వోన్నతుడవని సర్వంపన్నుడవనిసాక్ష్యగీతం నే పాడెదన్ ॥హల్లె॥
3.గాలి తుఫానును అణచినావని సంపూర్ణశాంతిని ఇచ్చినావని
శక్తిమంతుడవని శాంతి ప్రధాతవని మహిమగీతంనే పాడెదన్ ॥హల్లె॥