పాట`125
ప:ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల యివేగా మా కృతజ్ఞతస్తుతులు
అర్హుడవు అర్హుడవు గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు
రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు అర్హుడవు గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు
మహిమయు, ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు
1.పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము
తొలగించి సిలువ శక్తితోనే నూతన జీవులుగా
మార్చెను ఆ సిలువ శక్తితోనే నూతన జీవులుగా మార్చెను ।అర్హు॥
2.దేవుని ప్రేమ విస్తరింపగా కృపావరమునే దానముగా
యేసుక్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను
నా యేసు క్రీస్తులోనే నీతిమంతులుగా మార్చెను ॥అర్హు॥
3.దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగాచేసితివి క్రీస్తుతో రాజ్యమేలగా
జయించువారిగా మార్చెను నా క్రీస్తుతో రాజ్యమేలగా
జయించు వారిగా మార్చెను ॥అర్హు॥