ప: దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు
నా ప్రాణమా (దేవు)
1. ఏ అపాయము రాకుండా నిన్ను దీవారాత్రులు
కాపాడువాడు ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు (దేవు)
2. చీకటిని వెలుగుగా చేసి ఆయనె నీ ముందుపోవువాడు
సత్యమగు జీవమగు మార్గమేసే (దేవు)
3. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ
దేవుడు నిన్ను తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు (దేవు)
4. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు
ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో (దేవు)
5. నీకు విరోధముగా రూపించిన ఏవిధ ఆయుధమును
వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారెదరు (దేవు)
6. పర్వతములు తొలగిపోంనను తన కృప నిన్ను ఎన్నడు
వీడదు కనికర సంపన్నుడా నా దేవుడు (దేవు)
7. స్తుతి మహిమలు నీకే ప్రభూ నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (దేవు)