పాట `175
ప:నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైనా నను విడువడు
అడుగులు తడబడిన అలసట పైబడిన (2)
చేంపట్టి వెన్నుతట్టి చక్కని ఆలోచన చెప్పి (2) ॥నడి॥
1.అంధకారమే దారి వూసిన
నిందలే నను కృంగదీసిన
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యము వరకు నను చేర్చుతాడు (2) ॥నడి॥
2.కష్టాల కొలిమి కాల్చివేసినా
శోకాల గుండెను చీల్చి వేసిన
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యము వరకు నను చేర్చుతాడు (2) ॥నడి॥
3.నాకున్న కలిమి కరిగిపోంనా
నాయుక్క బలిమి తరిగిపోంనా
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యము వరకు నను చేర్చుతాడు (2) ॥నడి॥