పాట`264
ప. యేసయ్యా నామములో శక్తి ఉన్నదయా,
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయా
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని (2)
1. పాపాలను క్షమియించే శక్తిగలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్ర పరచే శక్తి గలిగినది యేసయ్య నామం ॥యేసయ్య॥
2. రోగికి స్వస్థతనిచ్చె శక్తి గలిగినది యేసయ్య నామం
మనస్సుకు నెమ్మదినిచ్చే శక్తి గలిగినది యేసయ్యనామం ॥యేసయ్య॥
3. దురాత్మలను పారద్రోలే శక్తి గలిగినది యేసయ్య నామం
దు:ఖితులను ఆదరించే శక్తి గలిగినది యేసయ్య నామం ॥యేసయ్య॥
4. సృష్టిని శాసించకలిగే శక్తి గలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగే శక్తి గలిగినది యేసయ్య నామం ॥యేసయ్యా॥
5. పాతాళాన్ని తప్పించే శక్తి గలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే శక్తి గలిగినది యేసయ్య నామం ॥యేసయ్య॥