పాట `283
ప: యేసు నీ స్వరూపమును నేను చూచుచు
నీ పోలికగా నేను మారేదన్
1. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి
దాసుని రూపము ధరించి దీనుడైతివి
నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నాను
నీదు వినయముతో నింపుము
2. ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివి
నీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి
నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నాను
నీ ప్రేమతో నింపుము
3. యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్
నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదన్
ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్దపరచుము
నీ పవిత్రతతో నింపుము