పాట`154
ప: ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను
హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ॥ఎంత॥
1.రక్షకుండా నాకు బదులు శిక్షననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి చావొందితివి నాకై ॥ఎంత॥
ఏమి నీ కర్పించగలను ఏమిలేనివాడనయ్యరక్షణంపు
పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ॥ఎంత॥
2.నీదు నామమునకు యిలలోభయపడెడు
వారి కొరకైనాధుడా నీ విచ్చు
మేలు ఎంత గొప్ప దేసువా ॥ఎంత॥
3.నేను బ్రతుకు దినములన్ని క్షేమ
మెల్ల వేళలందునిశ్చయముగా
నీవు నాకు ఇచ్చువాడా ప్రభువా ॥ఎంత॥
4.నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చువాడవీవు నాదు కాపరివి
నీవు నాకు లేమి లేదుగా ॥ఎంత॥
5.అందరిలో అతిశ్రేష్టుడా అద్వితీయుడగు
యేసయ్యాహల్లెలూయా స్తోత్రములను
హర్షములతో పాడెద ॥ఎంత॥