ట `359
1. చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు
తలుపులు తెరిచియుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా
అ.ప: తలుపులు తెరిచియుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా
కాలమపాయముగా నుండె సమయము సద్వినియోగించు
2. బీడు భూములకధికముగా చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు ప్రేమ సువార్తను చాటించు ॥తలు॥
3. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు ఎదురుండన్ ప్రవేశింతురు జ్ఞానులు ॥తలు॥
4. విశ్వాసుల సహవాసము ప్రేమ ఐక్యత గలదు
అని చెప్పెడి దినములు మన మధ్యకు రావలెను
॥తలు॥
5. రానైయున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము
॥తలు॥