పాట`263
ప. ఆనందమానంద మానందమే నా దేవుని సన్నిధిలో (2)
ఆనందమానందమే నా ఆత్మీయ సంఘములోన
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. సోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతోమేలు
ఎంతో రమ్యం ఎంతో మనోహరమే
అచ్చట దేవుడు ఇచ్చెను దీవెన శాశ్వతజీవమును (2)
2. చూచుచున్న సోదరుని ప్రేమించకుండా
నీకు అగుపడని దేవుని నీవు ప్రేమించలేవు
తన సోదరుని ద్వేషించువాడు దేవునికి విరోధి
3. ఎవరినీ విమర్శింపక ఓర్చుకొనము
అప్పుడు నీవు దేవుని బిడ్డగా ఎదిగెదవు సుమా
నీ జీవితములో విజయాన్ని సాధించెదవు