పాట `88
ప: సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ సర్వాధికారి
యేసుని సిలువచే కలిగెను
అప:సర్వోన్నతుండగు దేవుని సేవకులైయుండియు
సర్వోన్నతుని చిత్తంబున సర్వదా స్తుతింంచెదము
పరలోక యెరుషలేమున పరిశుద్ధుల
సంఘంబు వరియు భర్తయేసుకై అరుదెంచు చుండెను
పరిశుద్ధ పట్టణమందున ప్రభుయేసు క్రీస్తుండు
ప్రకాశమానదీపమై ప్రజ్వలించుచునుండె ॥సర్వో॥
2. దేవుని సింహాసనమున దేవుని మహిమలో సువర్ణ
కిరీటంబులధరించిన పెద్దల జీవుల మధ్యనుండెను
దేవుని గొర్రెపిల్ల ఘనత మహిమ ప్రభావవము
యుగయుగవలు ఆయనకే ॥సర్వో॥
3. స్ఫటికంబు బోలినట్టి మెరయు జీవ జలనది పట్టణపు వీధులలో
ప్రవహించుచుండెను స్ఫటికంపు నది కిరుప్రక్కల జీవ ఫలవృక్షంబు
స్వస్థత కలిగించును వృక్షంపు యాకులు ॥సర్వో॥
4.బండలో నుండి నీటి కాల్వల నిండుగ
రప్పించెన్ మెండైన నదుల నీళ్ళను
దండిగ పారించెన్ బండైన క్రీస్తును
చీల్చెను ప్రభు దేవుండే మనకు
నిండార నింపునాత్మను తండ్రి విధేయులన్ ॥సర్వో॥
5.మెట్టల స్థలమందున నదుల పారజేతున్
ఊటల నెన్నో లోయల నుబుకంగ
జేతును నీటిమడుగులుగ మార్చెద
నరణ్యము నంతటిని నీటి బుగ్గలుగ చేతును ఎండిన నేలను ॥సర్వో॥
6.దావీదు పట్టణమందున దావీదు సంతతిలో
దేవుని సర్వశక్తితోజిన్మించె
యేసుండు దావీదు తాళము కలిగి
తన సింహాసనమందు తావిచ్చి చేర్చుకొనును జంంచువారిని ॥సర్వో॥
7.సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు
విలువైన రక్తవ కార్చెను
మలినంబు బోగొట్టన్ బలుడైన ఆత్మ శక్తితో
గెలిచె సమాధినిబలిమిచ్చును
పరిశుద్ధులకు హల్లెలూయా పాడెదము ॥సర్వో॥