పాట `69
ప: దేవా నిన్ను స్తుతియించుట నాకు ఎంతో ధన్యము
మహోన్నతుడా మహఘనుడా
దినమెల్ల నీ పాట నే పాడెదన్
ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన (2)
1. పూజ్యడవు యోగ్యుడవు పరిశుద్దుడవు పరిపూర్ణుడవు
ధవళవర్ణుడా రత్నవర్ణుడా నా స్తుతులన్నిటికి ఆధారమా ॥ఆరా॥
2. నీ నామమే అతి మధురము నిన్ను స్మరియించుట ఎంతో బలము
యేసుప్రభువా నా యేసు దేవా నా యేసు రాజా నా దైవమా ॥ఆరా॥
3. కృపామయుడా, దయామయుడా ప్రేమామయుడా, జ్యోతిర్మయుడా (2)
స్తుతియు నీకే, ఘనత నీకే మహిమ నీకే నా యేసయ్యా (2) ॥ఆరా॥