.పాట-110
నీ ప్రేమ ఎంతో గొప్పది నీ కృప ఎంతో ఉన్నతమైనది
నాకై మరణించి రక్షించిన నీ ప్రేమ అద్భుతము
నీకేమి చెల్లింతును యేసయ్య ఏమిత్తును
నిన్ను కీర్తించి నిన్ను ఘనపరచి నిన్నే వెంబడిరతును
1.నీ మాట శక్తి గలది నీ చూపు ఎంతో కరుణగలది
నన్ను బలపరిచి నడిపించిన యేసయ్యా
యేసు ప్రేమలో ఉంది విజయం ఎంతో సంతోషం
విలువైనది సిలువలోన ఏసు ప్రేమ
2.నా స్థానమందు నిలచి నా శిక్షను భరియించి
క్రయధనమును చెల్లించిగొప్ప రక్షణ ఇచ్చినది
ఆ ఉన్నత రాజ్యమందునాకు స్థానమిచ్చినది
ఉన్నతమైన ప్రేమ ఇది అత్యున్నమైన ప్రేమ ఇది