పాట -297
1.దూతపాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమం దునన్
భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబునందున మ్రోగు పాట చాటుడీ
దూతపాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీ
2.ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శుద్దులు
అంత్యకాలమందున కన్యగర్భ మందున
బుట్టినట్టి రక్షకా ఓ రమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా నిన్ను నెన్న శక్యమా?
దూతపాట పాడుడీ రక్షకున్ స్తుతించుడీ
3.రావె నీతి సూర్యుడా రావె దేవ పుత్రుడా
నీదు రాకవల్లను లోక సౌఖ్యమాయెను
భూనివాసు లందరు మృత్యుభీతి గెల్తురు
నిన్ను నవ్మవారికి ఆత్మ శుద్ధి కల్గును
దూతపాట పాడుడీ రక్షకున్ స్తుతించుడి