పాట `76
ప: మంచికాపరి నా యేసయ్య నీవు మేపు గొర్రెను నేను
నీ మార్గములో నడిపించుమా నా చుట్టూ నీ రక్తం కంచె వేjమా
1. లయమైపోవు ఈ లోకము ఎంతో పచ్చగా కనబడుచుండె
పాపకర్షణలో పడనియ్యకువాటిని నన్ను ఏలనియ్యకు ॥మంచి॥
2. వ్యర్ధమైన వాటిని చూడకుండగా నా కన్నులు నీవైపు త్రిప్పివేయుమా
నీ మార్గములో నడుచుకొనుటకు దేవా నన్ను బ్రతికించుము ॥మంచి॥
3. గాయపడి నడువలేని సమయమందును మోసావు నీవు భుజవలపైన
బలమైన నీ రెక్కల క్రింద సురక్షితవగా కాచిన దేవ ॥మంచి॥