పాట `100
ప: నూతన గీతవ పాడెదను నా ప్రియుడేసునితో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ॥నూతన॥
1. యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి యేసు నాలో ఉన్న కాపరి ॥నూతన॥
2. ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను
అభినంంచి పాడెదను అనుభవించి పాడెదను
అనుదినమునే పాడెదను అందరిలోనే నే పాడెదను ॥నూతన॥
3. శుత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా
అజేయుడేసుని చేరెదను విజయగీతముల్ పాడెదను
ధ్వజమునెత్తి పాడెదను భజన చేయుచు పాడెదను |నూతన॥