పాట `47
ప: ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసూ స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లడల వల్ల పడదె వివరింప
1.విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ॥ఎల్ల॥
2. సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు నాత్రిత్వము నీవే ॥ఎల్ల॥
3.జ్ఞానము నీవే నాపానము నీవే దానము నీవే నా గానము నీవే ॥ఎల్ల॥
4. జ్యోతియునీవే నా నీతిమయు నీవే ఆదిమయు నీవే నా అంతము నీవే ॥ఎల్ల॥
5.నిత్యుడనీవే నా సత్యుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ॥ఎల్ల॥
6.జీవమునీవే నా దేవుడనీవే పావన మీవే నా కావలి నీవే ॥ఎల్ల॥
7. కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస మీవే నాకంతయు నీవే ॥ఎల్ల॥