పాట`222
ప:జయము నీదే జయము నీదే ఓ సేవకుడా
భయము లేదు భయము లేదు ఓ సైనికుడా
1.యేసుక్రీస్తు నీతో ఉండి, చెయ్యి పట్టి నడుపగా
భయమేంటి నీకు భయమేంటి ॥జయము॥
2. రాజులే అయిన అధికారులే అయినా
భయమేంటి నీకు భయమేంటి
॥జయము॥
3.ముందు సంద్రమే ఉన్నా వెనుక శత్రువే
అయినభయమేంటి నీకు భయమేంటి
॥జయము॥
4.తుఫాను లెన్ని ఎదురైనా సుడిగాలులే ఎదురైనా
భయమేంటి నీకు భయమేంటి
॥జయము॥
5.వెయ్యి మంది పడిన పదివేల మంది కూలిన
భయమేంటి నీకు భయమేంటి
॥జయము॥