పాట -301
ప:అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారముర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనంద సంద్రావప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసుపయనమైతిని
||అం
1.విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగదోచెను
వింతైన శాంతి వర్షించెనాలో విజయపధవన
విశ్వా నేలేడి దేవకుమారిని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలవ ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందా||
2.యెరుషలేవ రాజనగరిలో యేసుని వెదకుచూ
ఎరిగిన దారి తొలగినవేళ యెదలో కృంగితి
యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు స్మయవెదుచు యేగితి స్వామి కడకూ ||అందా||