పాట`139
ప:దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది
1.స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడెద హృదయముతో
స్తుతించి వర్ణించి ఘనపరతున్ నీవె నా రక్షకుడవని ॥దేవా॥
2.మొదట నిన్ను యెరుగనైతిని మొదటే నన్ను యెరిగితివి
వెదుకలేదు ప్రభువా నేను వెదికితివి యీ పాపిని ॥దేవా॥
3.మరణమగు వూబిలో నుంటిని కరుణ నిలిచెనన్ను రక్షింప
మరణమునుండి రక్షింపనన్ నా ప్రభు బలియాయెను ॥దేవా॥
4.పాప లోకములో మునిగియుంటి పాప శిక్షకు పాత్రుడను
యేసు ప్రభు సిలువ సహించెను నాకు నూతన జీవ మొసగ ॥దేవా॥
5.అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి
ప్రభును వర్ణింప నశక్యము ప్రభువే సహించె దు:ఖము ॥దేవా॥
6.యెట్లు మౌనంగా నుందు ప్రభూ చెల్లింపక స్తోత్ర గీతము
కాలమంతా పాడుచుండెద నీ ప్రేమ అపారమైనది ॥దేవా॥