పాట `379
ప: రాజాధిరాజా రావే రాజయేసు రాజ్యమేలరావే
రాజులకు రాజువై రావే రవికోటి తేజయేసురారా
ఓ... మేఘవాహనంబుమీద వేగమే
ఓ... మించు వైభవంబుతోడ వేగమే ॥రాజా॥
1. ఓ... భూజనంబులెల్ల తేరిచూడగా ఓ... నీజనంబు స్వాగతంబు
నీయగా నీరాజ్య స్థాపనంబు చేయ భూరాజు లెల్ల కూలిపోవ
భూమియాకసంబు మారిపోవ నీ మహా ప్రభావవన వేగ ॥రాజా॥
2. ఆ... ఆకశవన దూతలార్భటింపగ ఆ... ఆదిభక్త సంఘసమేతంబుగా ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై
మహాసభ చేయ యేసునాధ నీదు మహిమలోన మాకదే
మహానందమౌగ ॥రాజా॥
3. ఓ... పరమ యెరూషలేవ పుణ్య సంఘమా
ఓ... గొరియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమదూతలారా భక్తులారా! పౌలపోస్తులారా! పెద్దలారా!
గొరియపిల్ల యేసు రాజు పేర క్రొత్త గీతమెత్తి పాడరారా ॥రాజా॥