పాట `239
యేసుని నిత్యము స్తుతియించెదము
భూమి ఆకాశము సృజించినాడు
మనలో దేవుని సంకల్పము యేసుని బయలుపరచుటయే
ప: యేసు మారడు యేసు మారడు విశ్వమంత మారినను మాటతప్పడు
ఎందరిని ప్రభుముందు ఎరిగెనో అందరిని
ప్రభు నిర్ణయించెనుపొందుగ పిలిచి నీతిగా
తీర్చె సుందరముగా మహిమ పర్చు ॥యేసు॥
చేసెను మనలను తన రూపమున బాసెను
పాపముచే నా రూపంయేసులో నొసగే
మరల మనకు వాసిగ కాచును పుత్రులుగా ॥యేసు॥
4. దేవుని ప్రేమించువారందరికి భువిలో జరుగునన్ని మేలుకై
కావవి ఎన్నదగిన శ్రమలు భావి మహిమతో పోల్చుటకై ॥యేసు॥
5. శ్రమయు బాధ హింసjైునను కరువు వస్త్రహీనతయును
ఉపద్రవమైనను ఖడ్గుమైనను ఎడబాపునే ప్రభు ప్రేమనుండి ॥యేసు॥
6. మరణము జీవమైనను దేవదూతలు ప్రధానులు
అధికారులు మరి ఎవరైనను ఎడబాపరు
ప్రభు ప్రేమనుండి ॥యేసు॥
7. అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని బయలుపరప
మానవలెను మన పాపములు పూనికతో పూర్ణ ఐక్యతకు ॥యేసు॥