పాట `57
ప: పూజనీయుడు నా యేసయ్యా కీర్తనీయుడు నా యేసయ్యా
పరిశుద్దుడు నా యేసయ్యా ఆడిపాడి స్తుతించెదను
1. ఘోరపాపినైన నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చి నావు
నీవు చూపిన ఆ ప్రేమకై నీ రుణమును తీర్చలేనయ్యా
2. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకున్నావు నీ సేవకై
నా బ్రతుకు దినములన్నియు నీ పాదసేవ చేసెదనయ్యా
3. నీవు చేసిన మేళ్ళన్నియు మరువక నే ధ్యానించెదన్
శక్తిమంతుడు నీవేయని లోకమంత చాటెదనయ్యా