పాట `190
ప: యెహోవా నావెర లాలించెను దనమహాదయను
ననుగడిరచెను అహర్నిశల దీనహీనుడగు నాదుహ! యనెడు
ధ్వని గ్రహించి మనిపెను యె॥
1. పిశాచి గడిమి బడగొట్టెను దనవశాన నను నిలువబెట్టెను
ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున జేర్చి
సేదదీర్చెను ॥యె॥
2. మదావళవ బోలు నామదిన్ దనప్రదీప్త వాక్యాంకుశాహతిన్
యధేచ్ఛలన్నిటి గుదించి పాపపు వెదల్ తుదల్ నరికి
దరికిజేర్చెన్ ॥యె॥
3. అనీతి వస్త్రయెడలించెను యేసునాధు రక్తమున వంచెను
వినూత్న యత్నమై దనూని యెన్నడు గనన్
వినన్ బ్రేమ నాకు జూపెను ॥యె॥
4. విలాపవలకు జెవినిచ్చెను శ్రమ కలాపవలకు సెలవిచ్చెను
శిలానగముపైకిలాగి నను సుఖకళావళుల్
మనసులోన నిలిపెను ॥యె॥
5. అగణ్య పాపియని ద్రోయక నన్ను గూర్చి తనసుతుని దాచక
తెగించి మృతికొప్పగించి పాపపు నెగుల్
దిగుల్ సాగసుగా నణంచెను ॥యె॥