పాట `5
ప: కాంతి కిరణాల శాంతి ప్రధాత నీతి న్యాయాల ఖ్యాతి విధాత
ప్రణుతులు నీకే ప్రేమ సంధ్యాత శరణు శరణు మా యేసురాజా
ఆమేన్ హల్లెలూయా... హోసన్నా హోసన్నా... (2)
హల్లెలూయా పాడెదను స్తోత్రాలు చెల్లింతును ॥కాంతి॥
1.సృష్టి స్థితిలయ కారకుడా సర్వము నీవే మా దేవా
నిను సేవించుట మా భాగ్యం నీ ఆరాధనే మా క్షేమం ॥ఆమేన్॥
2.పాపము నుండి తొలగించి పావము రూపవము నొసగితివి
చీకటి నుండి తొలగించి వెలుగును మాకు చూపితివి ॥ఆమేన్॥
3.గర్వము నుండి తొలగించి సాత్విక జ్ఞానము నొసగితివి
ధాత్రిని మేము ధన్యులము నీ దీవెనలే మా సిరులు (2) ॥ఆమేన్॥